నాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు  : మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురాతన జామా మసీదు అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా రూ.50 లక్షల నిధులు  కేటాయిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ చరిత్రను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

 హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి ఉంటేనే సంపూర్ణ భారతమవుతుందని తెలిపారు. సమాజంలోని ప్రజల  మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు హబీబ్, నాయకులు పాల్గొన్నారు